ఓవైపు సేనాపతి, మరోవైపు వేట్టయాన్... కమల్ హాసన్, రజనీకాంత్ తాజా పిక్ వైరల్

  • 'ఇండియన్-2'తో ప్రేక్షకుల ముందుకు రానున్న కమల్ హాసన్
  • ప్రస్తుతం జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రం చేస్తున్న రజనీ
  • ఇరువురితో కలిసి 'ఇండియన్-2' ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుందర్ రాజ్ ఫొటోగ్రాఫ్
దక్షిణాది సినీ పరిశ్రమకు రెండు కళ్లు వంటి వారు కమల్ హాసన్, రజనీకాంత్. 69 ఏళ్ల కమల్, 73 ఏళ్ల రజనీ ఇప్పటికీ కుర్ర హీరోలకు దీటుగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ 'ఇండియన్-2' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా... రజనీకాంత్ 'వేట్టయాన్' లో నటిస్తున్నారు. 

తాజాగా, వీరిద్దరూ సెట్స్ పై కలిసిన ఫొటో వైరల్ అవుతోంది. ఇండియన్-2 చిత్రంలోని సేనాపతి గెటప్ లో కమల్ హాసన్... వేట్టయాన్ రజనీకాంత్... మధ్యలో ఇండియన్-2 ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుందర్ రాజ్ ను ఆ ఫొటోలో చూడొచ్చు. 

కాగా, కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తున్న 'ఇండియన్-2' చిత్రం జులై 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 

రజనీకాంత్ నటిస్తున్న 'వేట్టయాన్' అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. 'వేట్టయాన్' చిత్రానికి 'జై భీమ్' ఫేమ్ జ్ఞానవేల్ రాజా దర్శకుడు.

Kamal Haasan-Rajinikanth
Indian-2
Vettaiyan
Kollywood

More Telugu News